Bhuvanagiri : భువనగిరిలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
Bhuvanagiri : భువనగిరిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం (BRS Party Office) పై కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న దాడి చేసిన నేపథ్యంలో నిరసనలు ఉధృతమయ్యాయి. బీఆర్ఎస్ బంద్(Band)కు పిలుపునిస్తూ మహాధర్నాకు ఉపక్రమించగా పోలీసులు అనుమతించలేదు. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మహాధర్నా ప్రదేశం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పట్టణమంతా భారీ బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారు.
ఎక్కడికక్కడే కట్టడి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచెర్ల రామకృష్ణరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు (Congress Leaders) నిన్న (శనివార...

