Turmeric Board : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. నిజామాబాద్ లో పసుపుబోర్డు..
Turmeric Board : సంక్రాంతి పండుగ వేళ కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్ కేంద్రంగా కొత్తగా పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Central Government) అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన ప్రయత్నం ఫలించింది. గతంలో స్పెసెస్ బోర్డు (spices board) ఏర్పాటు చేయగా, ప్రత్యేకించి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పసుపు బోర్డుతో తెలంగాణలో పసుపు రైతుల క్రయవిక్రయాలు, ప్రాసెసింగ్‌కు మరింత ప్రోత్సాహం లభించనుంది.
నిజామాబాద్ (Nizamabad) లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించను...


