South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవంతమయ్యాయి. ప్రస్తుతం అవి నడుస్తున్న అన్ని రూట్లలో ప్రయాణికులతో నిండిపోతున్నాయి.
అన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు స్థిరంగా 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. హైదరాబాద్‌తో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కనెక్టివిటీ సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్ - తిరుపతి, కాచిగూడ - యశ్వంతపూర్ (బెంగళూరు), సికింద్రాబాద్ - నాగ్‌పూర్ మార్గాల్లో సేవలందిస్తున్నాయి.. వందే భారత్ ఆక్యుపెన్సీకి సంబంధించిన ఇటీవలి వివరాల ప్రకారం.. ఈ సేవలను 143 శాతం వరకు అధిక ఆదరణ పొందుతున్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 100 శాతం కంటే ఎక్కువ ఆక్యు...




