Raja Goutham : ఆ మూవీ చేస్తే హీరో రేంజ్ వేరేలా ఉండేదేమో..
Raja Goutham : దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దర్శకత్వ పర్యవేక్షణలో సుచిత్ర చంద్రబోస్ డైరెక్ట్ చేసిన పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బ్రహ్మానందం (Brahmanandam ) తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham). ఆ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత వారెవా, బసంతి లాంటి అరకోర సినిమాలు చేసిన కూడా నటుడిగా పేరు తెచ్చే సినిమా ఒక్కటి కూడా పడలేదు. ఈయన సినిమాలు చేయక చాలా కాలమే అయిపోయింది.
గత చిత్రం షార్ట్ ఫిలిమ్స్ తీసి గుర్తింపు పొందిన ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్లో మను అనే మూవీ చేశారు. ఇది కూడా అంతంత మాత్రంగానే ఆడడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత తన తండ్రి బ్రహ్మానందంతో కలిసి 'బ్రహ్మ ఆనందం' (Brahma Anandam) మూవీలో నటించారు.
బ్రహ్మ ఆనందంతో..
ఒకప్పుడు బ్రహ్మానందం నటించని సినిమా అనేది లేదు. పెద్ద హీరోల సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా ఆయన ఉ...




