Tollywood : సంక్రాంతి విన్నర్ఆ మూవీనే….
Tollywood News : సంక్రాంతి వస్తుందంటేనే పెద్ద హీరోలు సినిమాలతో రెడీగా ఉంటారు.పండుగకు వారి మధ్య పోటీ ఉంటుంది. ప్రతి సంక్రాంతి లాగే ఈ సంవత్సరం కూడా మూడు సినిమాలు పోటీపడ్డాయి. గేమ్ చేంజర్ (Game Changer), డాకు మహారాజ్ (Daaku maharaj),సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాలతో ముగ్గురు పెద్ద హీరోలు వచ్చారు. ఈ మూడు సినిమాల్లో జనాల్లో సంక్రాంతి విన్నర్ అనిపించుకున్న మూవీ ఏంటో ఒకసారి చూద్దాం…
మొదట ఈనెల 10న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan)కీయారా అడ్వాని కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. భారీ సినిమాల డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మూవీలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.మూవీలో అంజలి పాత్ర పర్వాలేదనిపించినా.. డైరెక్టర్ ఎమోషన్స్ ని సరిగ్గా క్యారీ చేయకపోవడంతో ఆడియన్స్ ర...


