Chiranjeevi : మెగాస్టార్- కోదండరామిరెడ్డి కాంబినేషన్లో ఆఖరు మూవీకి 32 ఏళ్లు…
Megastar Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో ఇప్పటికి రారాజుగా వెలుగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 90 వ దశకంలో ఆయన సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్ థియేటర్లకి ఎగబడే వారు. అలాంటి క్రేజ్ ని మెగాస్టార్ సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. మెగాస్టార్ డాన్సులు, ఫైట్లతో ఆడియన్స్ పిచ్చెక్కిపోయేవారు. ఇంటర్వెల్లో కూడా సీట్లలోనే కూర్చునేవారంటే మెగాస్టార్ రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఉర్రూతలూగించిన ముఠామేస్త్రీ
చిరంజీవి, కోదండ రామిరెడ్డి (Kodandarami Reddy ) కాంబినేషన్ లో ఖైదీ, రాక్షసుడు, అభిలాష, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, విజేత ఇలా దాదాపు 22 సినిమాలు వచ్చి అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ మూవీ చిరంజీవి కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. 1993 జనవరి 17న వీరి కాంబినేషన్లో ముఠామేస్త్రి (Muta mestri) సినిమా వచ్చింది. ఈ సినిమా ఆడియన్స్ ని ఉర్రూతలూ...




