Dhruva Natchathiram : ధృవ నక్షత్రం విడుదల ఎప్పుడో..?
Dhruva Natchathiram Release Date : రాఘవన్, ఘర్షణ, ఏ మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ గౌతమ్ మేనన్. ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి నటులకు ఉంటుంది. ప్రేమ కథలను చాలా హృద్యంగా తీయడంలో ఈయన దిట్ట. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా రాలేదు కానీ నటుడుగా మాత్రం పలు సినిమాల్లో చేసే బిజీగా మారారు.
నాగచైతన్య మొదటి సినిమా ఏం మాయ చేసావే తోనే మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు సమంత ఈ మూవీ తోని వెండితెరకు పరిచయమైంది. విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం అనే మూవీ తెరకెక్కింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. పలుమార్లు విడుదల తేదీలను ప్రకటించిన వాయిదా పడడం జరుగుతూ వస్తోంది. దీనిపై లేటెస్ట్గా గౌతమ్ మేనన్ మాట్లాడారు. ఈ చిత్రం విడుదల కాకపోవడం నన్ను నా కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేస్తుంద...




