Metro Rail | బెంగళూరు మెట్రో ధరలు పెరిగాయి.. హైదరాబాద్ లోనూ పెంచుతారా?
Hyderabad Metro Rail : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ఆర్టీసీ బస్సు ఛార్జీలను 15 శాతం పెంచింది. మరోవైపు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మెట్రో ఛార్జీలను కూడా దాదాపు 43 శాతం పెంచాలని కర్ణాటక సర్కారు యోచిస్తోంది.
మెట్రో కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి ఛార్జీలను సవరించలేదని BMRCL అధికారులు పేర్కొన్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, స్టేషన్లలో మౌలిక వసతులు, రైళ్ల నిర్వహణ, మహిళల కోసం ప్రత్యేక కోచ్‌లను అందించడం, సీనియర్ సిటిజన్లు, ఇతరులకు ప్రత్యేక సేవలను అందించడం వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని, మెట్రో ఛార్జీలను పెంచాల్సి వస్తున్నదని BMRCL పేర్కొంది. ధరల సవరణ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఛార్జీల పెంపుదలని బీఎంఆర్‌సీఎల్ ప్రతిపాదించింది. అయితే బీఎంఆర్‌సీఎల్ నిర్ణయం ప్రయాణికులకు ఏమాత్రం మింగుడు పడడం ...




