Bhoraj Check Post : రహదారిపై కాసుల వర్షం.. ఒడిసి పట్టుకుంటున్న అధికారులు..?
భోరజ్ చెక్ పోస్టా..? మజాకా..?
వసూళ్లు చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు..? ఏసీబీ రైడ్స్ జరిగినా మారని అధికారులు
మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కు ఓ లెక్క..?అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కు మరో లెక్క..?
వ్యవహారాలు చక్కబెడుతున్న సీనియర్ ఎంవీఐ ?
Bhoraj Check Post : ఆ రహదారిపై రోజూ కాసుల వర్షం కురుస్తోందట.. అక్కడ విధులు నిర్వహించే అధికారులు ఆ కాసుల వర్షాన్ని జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే అక్కడ విధులు నిర్వహించడానికి అధికారులు పోటీపడుతుంటారని సమాచారం.ఆ చెక్ పోస్ట్ లో నెలకు 6 లేదా 7 రోజులు మాత్రమే డ్యూటీ ఉంటుందట, ఒక్క డ్యూటీకే లక్షల రూపాయల మామూళ్లు వస్తాయని ఆరోపణలు ఉన్నాయి.ఆ చెక్ పోస్టులో డ్యూటీ కోసం గత ప్రభుత్వంలో ఒక్కో ఎంవీఐ గరిష్టంగా 15 లక్షల వరకు ముట్టజెప్పారంటే "భోరజ్ చెక్ పోస్టా..?మజాకా…?" చెక్ పోస్ట్ (Bhoraj Check Post ) లో ఇటీవలి కాలంలో రెండు సార్ల...



