Youth Congress : రణరంగంగా మారిన గాంధీభవన్.. ఒకరినొకరు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు..
Gandhi Bhavan : హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు (Youth Congress Leaders) ఒకరినొకరు పరుషపదజాలంతో తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించినవ వీడియోలు సోషల్‌మీడియాలో ఇపుడు వైరల్‌గా మారాయి. కొందరు నాయకులు కలిసి ఓ వ్యక్తిని కొడుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బుధవారం గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం ప్రారంభమైన కాసేపటికి గందరగోళం ఏర్పడింది. యూత్ కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత ఇరు పక్షాలు పరస్పరం దూషణలు, దాడులకు దిగారు. పార్టీలో పదవుల కోసం ఇరువర్గాల నేతలు కొట్టుకున్నట్లు తెలిసింది.
ఇతర పార్టీల నుంచి వొచ్చిన వారికి పదవులు ఎలా కేటాయిస్తారంటూ కొత్తగూడెం జిల్లాలకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. సుదీర్ఘకాలం నుం...




