Davos : డావోస్‌లో చంద్రబాబు.. వ్యాపార దిగ్గజాలతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని డావోస్ (Davos)లో పర్యటిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Microsoft founder Bill Gates)తో పాటు అనేక మంది అంతర్జాతీయ కార్పొరేట్ అధిపతులతో ఈ రోజు చంద్రబాబు నాయుడు ( N Chandrababu Naidu) సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షిస్తూ తద్వారా అనేక ప్రాజెక్టులను స్థాపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా వీరి మధ్య చర్చలు, ఒప్పందాలు జరిగాయి.
చంద్రబాబు Davos పర్యటన.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కీలకం
స్విస్ రిసార్ట్ టౌన్‌లో చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఈ భేటీ కీలకం కానుంది. యునిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్, పెప్సి, ఆస్ట్రాజెనెకా వంటి కంపెనీల అధిపతులతో సమావేశమై రాష్ట్ర...
