UPSC Civil Services 2025 | యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్ విడుదల
UPSC Civil Services 2025 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)-2025 నోటిఫికేషన్ జారీ అయ్యింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) ఎగ్జామినేషన్‌కు ప్రకటన విడుదలైంది. 979 సివిల్ సర్వీసెస్, 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) పోస్టులను భర్తీ చేయనున్నారు. 2024 సంవత్సరం నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య కాస్త తగ్గించారు. అయినా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ఎంతో ప్రధానమైనది. యూపీఎస్సీ పరీక్షల ద్వారా తమ బంగారు భవిష్యత్తుకు బాట వేసుకొనేందుకు ఇదెంతో చక్కని అవకాశం. దేశానికి సేవ చేయడానికి ఒక గొప్ప ప్లాట్‌ఫాం. కఠినమైన శ్రమతో కూడుకొని ఉన్నా సమర్థమైన ప్రణాళిక, పట్టుదలతో ఈ లక్ష్యాన్ని సాధించుకోవచ్చు.
పరీక్ష రాయడానికి అర్హతలు:
సివిల్ సర్వీసెస్ :
UPSC Civil Services 2025 ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉ...


