Udaan Yatri Cafe | హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఇపుడు అతి తక్కువ ధరలకే ఆహారం
                    Udaan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో ఆహార ధరలు విపరీతంగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. విమానాలు ఆకాశం వైపు దూసుకెళ్లినట్టే ఇక్కడి ధరలూ పైపైకి పోతుంటాయి. ఈ నేపథ్యంలోనే విమాన ప్రయాణికులకు అతి తక్కువ ధరల్లో ఆహారాన్ని అందించేందుకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (Netaji Subhas Chandra Bose International Airport)లో ఉడాన్ యాత్రి కేఫ్ (Udaan Yatri Cafe) ప్రారంభమైంది. విమానాల్లో దొరికే ఆహారం ధరలకన్నా మూడింట రెండో వంతు రేట్లకే ఈ కేఫ్‌లో లభ్యమవుతున్నాయి.
Udaan Yatri Cafe ప్రత్యేకతలు
కొత్తగా ప్రారంభమైన ఉడాన్ యాత్రి కేఫ్‌లో అందించే ధరలు ఇలా ఉన్నాయి.
టీ: రూ. 10
వాటర్ బాటిల్: రూ. 10
కాఫీ: రూ. 20
సమోసా: రూ. 20
స్వీట్లు: రూ. 20
ఇంత తక్కువ ధరల్లో ఈ పదార్థాలను అందించడం వల్ల ప్రయాణికుల నుంచి ఉడాన్ యాత్రి కేఫ్ విశేష ఆదరణ పొందుత...                
                
             
								



