Sarkar Live

Day: January 25, 2025

Prashanth Varma | ప్రశాంత్ వర్మ త‌ర్వాత‌ మూవీపై సస్పెన్స్‌..!
Cinema

Prashanth Varma | ప్రశాంత్ వర్మ త‌ర్వాత‌ మూవీపై సస్పెన్స్‌..!

Prasanth Varma Next Movie | హనుమాన్ (Hanuman) మూవీతో అన్ని ఇండస్ట్రీల్లో ప్రశాంత్ వర్మ (Prasanth Varma )పేరు మార్మోగి పోయింది. అప్పటి వరకు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో మూవీస్ తీస్తాడనే పేరున్న కూడా హనుమాన్ మూవీతో మాత్రం ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ ని చేసింది. అతి తక్కువ బడ్జెట్‌లో సినిమా తీసి 400 కోట్లు కొల్ల‌గొట్టి టాప్ డైరెక్టర్ల లో తానూ ఒకడిన‌ని నిరూపించుకున్నాడు. ఆ మూవీ వచ్చి ఏడాది దాటిపోయినా మరో మూవీ చేయడానికి టైమ్ తీసుకుంటున్నాడు. తన డైరెక్షన్ లో మూవీ చేయాల‌ని స్టార్ హీరోలు కూడా రెడీగా ఉన్నా ప్రశాంత్ వర్మ మాత్రం ఏ మూవీ చేయాలా అని గందరగోళంలో ఉన్న ట్లు తెలుస్తోంది. Prasanth Varma హనుమాన్ కు సీక్వెల్ హనుమాన్ మూవీకి సీక్వెల్ జై హనుమాన్ తీస్తానని ఇప్పటికే ప్రకటించాడు. ఈ మూవీలో హనుమాన్ గా రిషభ్ శెట్టి ని కూడా కన్ఫామ్ చేస్తూ పోస్టర్ కూడా వదిలారు. మరొకవైపు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ...
Govt Schemes | రేపే కొత్త ప‌థ‌కాల పండుగ .. అక్కడికక్కడే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు..
State

Govt Schemes | రేపే కొత్త ప‌థ‌కాల పండుగ .. అక్కడికక్కడే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు..

Telangana Govt Schemes : తెలంగాణ సర్కారు నాలుగు కొత్త పథకాలను రేపు ప్రారంభించేందుకు సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ‌లుచేయ‌నున్న‌ రైతు భరోసా (Rythu bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ(Ration Cards), ఇందిరమ్మ ఇండ్ల పథకాలను (Indiramma housing Scheme) రేపు ప్రారంభించ‌నున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామ‌స‌భ‌లో ల‌బ్ధిదారుల‌కు మంజూరు ప‌త్రాల‌ను అందించ‌నున్నారు. నాలుగు పథ‌కాల ప్రారంభం, అమ‌లుతీరుపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వేర్వేరుగా శ‌నివారం స‌మీక్ష స‌మావేశాలు నిర్వ‌హించారు. ప‌విత్ర దినోత్స‌వ‌మైన గణతంత్ర దినోత్సవం నాడు ఈ నాలుగు పథకాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ శాంతి కుమారి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించి దిశానిర్ద...
Kashmir | కశ్మీర్ వందేభారత్ రైలు.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై పరుగులు | Video
National

Kashmir | కశ్మీర్ వందేభారత్ రైలు.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై పరుగులు | Video

Jammu Kashmir | కశ్మీర్ లోయలోని శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, శ్రీనగర్ (Srinagar ) రైల్వే స్టేషన్ మధ్య నడిపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Vande Bharat train) మొదటి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. భారతీయ రైల్వే తన విజయవంతమైన ట్రయల్ గురించి శనివారం వెల్లడించింది. ఈ రైలు తన ప్రయాణంలో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ వంతెన (Chenab Bridge) గుండా వెళ్ళింది. ప్రత్యేక వందే భారత్ కూడా అంజి ఖాడ్ వంతెన గుండా ప్రయాణించింది. ఇది దేశంలోని మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెన. జమ్మూలో ఉదయం 11:30 గంటలకు రైలు కొంతసేపు ఆగింది, అక్కడ ప్రజలు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. రైల్వే శాఖ ప్రకారం, ట్రయల్ పూర్తయిన తర్వాత దాని వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ రైలు షెడ్యూల్ ను ఇంకా ప్రకటించనప్పటికీ, త్వరలో PM నరేంద్ర మోదీ ఈ రైలు మొదటి ప్రయాణాన్ని కత్రా నుంచి ఫ్లాగ్ చేయను...
Mumbai attack | భార‌త్‌కు ముంబై దాడుల ప్రధాన సూత్రధారి.. అప్ప‌గించేందుకు అమెరికా ఆమోదం
World

Mumbai attack | భార‌త్‌కు ముంబై దాడుల ప్రధాన సూత్రధారి.. అప్ప‌గించేందుకు అమెరికా ఆమోదం

ముంబై (Mumbai attack) దాడుల ప్రధాన సూత్రధారి తహవుర్ రానా (Tahawwur Rana)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానాను భారత్‌కు అప్పగించాలని అక్క‌డి సుప్రీంకోర్టు 2025 జనవరి 1న ఆదేశాలు జారీ చేయ‌గా అదే న్యాయ‌స్థానం (United States’ Supreme Court )లో అత‌డు పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. త‌న‌ను భారత్‌కు అప్పగించొద్దని విజ్ఞ‌ప్తి చేశాడు. అత‌డి ఈ అభ్య‌ర్థ‌న‌ను అమెరికా సుప్రీం కోర్టు తిర‌స్క‌రించింది. ఈ నేప‌థ్యంలో రానాను త్వరలో భారత్ (India)కు తీసుకురావడం ఖాయమైంది. Mumbai attack Tragedy : ముంబై దాడులు.. తీర‌ని విషాదం ముంబై నగరంలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడి భారతదేశ చరిత్రలో అత్యంత భయానక ఘటనగా నిలిచింది. పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఉగ్రవాదులు 166 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ప‌క్కాప్ర‌ణాళిక‌తో ఈ ...
GSLV-F15 : ఇస్రో అద్భుత‌ ఆవిష్క‌రణ.. 100వ‌ మైలురాయిగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్‌15 ప్ర‌యోగం
State

GSLV-F15 : ఇస్రో అద్భుత‌ ఆవిష్క‌రణ.. 100వ‌ మైలురాయిగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్‌15 ప్ర‌యోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన సరికొత్త రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 జనవరి 29న‌ ఉదయం 6:23 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC) నుంచి GSLV-F15/NVS-02 మిషన్‌ను ప్ర‌యోగ‌నించ‌నుంది. ఇది ISROకు ఒక ప్రత్యేక ఘట్టం. ఇది శ్రీహరికోటలో జరిగిన 100వ ప్రయోగం ఇది. GSLV-F15 ప్రాధాన్యం శ్రీహరికోట నుంచి మొదటి రాకెట్ SLVను 1979 ఆగస్టు 10న ప్ర‌యోగించిన ఇస్రో అనేక మైలురాళ్లు దాటుతూ సుదీర్ఘ ప్ర‌యాణం చేస్తోంది. ఈ 46 ఏళ్ల‌లో ISRO ఎన్నో విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేసింది. కొత్త‌గా తన 100వ ప్రయోగాన్ని చేప‌డుతోంది. ఇది భారత అంతరిక్ష పరిశోధనలో నూతన అధ్యాయ‌నానికి నాంది పలుకుతోంది. ISRO సుదీర్ఘ ప్రయాణం GSLV-F15 (జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ప్ర‌యోగం ఇస్రోకు ప్ర‌ధాన మైలురాయి లాంటిది.దీని ద్వారా NVS-02 శాటిలైట్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బి (Geosynchronous...
error: Content is protected !!