Viral News | గిరిజన మహిళ ఇంటి ముందు వంటావార్పు.. బ్యాంకర్ల వింత ప్రవర్తన
Viral News | అప్పును రాబట్టేందుకు బ్యాంకు అధికారులు వింతగా ప్రవర్తించారు. మహిళా స్వయం సహాయక సభ్యురాలైన ఓ గిరిజన మహిళ ఇంటి ముందు పొయ్యి అంటించి వంటావార్పు చేశారు. నిరసన పేరుతో ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ మహిళ భయాందోళలకు గురైంది. బ్యాంకర్ల వైఖరిని చూసి గ్రామస్థులు విస్తుబోయారు. అప్పు వసూలు చేసే విధానం ఇదేనా? అని నిలదీశారు. ఈ ఘటన తెలంగాణలోని జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఈ రోజు (ఆదివారం) చోటుచేసుకుంది.
పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి.. ఓ మహిళా స్వయం సహాయక సంఘం (Self Help Group (SHG)లో సభ్యురాలు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank)లో ఆమెలో రూ. 61 వేల రుణం తీసుకుంది. వడ్డీతో పాటు అసలు చెల్లించడం భారమైంది ఆమెకు. ఈ క్రమంలో బ్యాంకు నుంచి పలుమార్లు రిమైండర్లు వచ్చాయి. చదువురాని ఆమె ఈ విషయాన్ని గమనించలేదు. సకాలంలో ఆమె డబ్బులు కట్టలేక...




