Trivikram | త్రివిక్రమ్ ఆ లిస్టులో చేరిపోతాడా..
                    Trivikram Movies | ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా వరకు పాన్ ఇండియన్ (Pan India movies) లెవల్లో తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు అదే ట్రెండు… ఏ కథకైనా పాన్ ఇండియన్ హంగులు అద్ది వారి మార్కెట్ ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే రాజమౌళి(Rajamouli), సుకుమార్ (Sukumar)లాంటి చాలా మంది డైరెక్టర్లు పాన్ ఇండియన్ మూవీ లు తీసి మార్కెట్ ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి త్రివిక్రమ్ (Trivikram) కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మూవీతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆ మూవీ కలెక్షన్ లకు బాక్సా ఫీస్ షేక్ అయింది. రెండు పార్ట్ లుగా తెరకెక్కించి కథను ఇలా కూడా తీయొచ్చు అని చాటి చెప్పింది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే భయపడే డైరక్టర్లు… ఇప్పుడు పార్టులుగా మూవీని తీసి బ్లాక్ బ్లస్టర్లు కొడుతున్నారు.
టాలీవుడ్ (Tollywood) నుండి ఒక మూవీ అనౌన్స్ చ...                
                
             
								



