GBS Syndrome | దేశంలో విస్తరిస్తున్న మరో మహమ్మారి.. మహారాష్ట్రలో తొలి మరణం
GBS Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barré Syndrome (GBS).. దీని పేరు ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడి నుంచో తిరుగుతూ మనదేశంలోనూ ఇది విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక మహమ్మారుల బారిన పడి ముప్పు తిప్పలు పడిన భారతీయులను కొత్తగా ఈ గులియన్-బారే సిండ్రోమ్ వ్యాధి కలవరపెడుతోంది.
పెరుగుతున్న GBS కేసులు
GBS Syndrome Causes : ఈ గులియన్-బారే సిండ్రోమ్ కేసులు మన భారతదేశంలో పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పూణే (Pune) ప్రాంతం ఈ వ్యాధికి కేంద్రబిందువుగా మారింది. జనవరి 9న జీబీఎస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ రోగి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అక్కడి వైద్యులు ప్రకటించారు. మహారాష్ట్ర (Maharashtra)లో గులియన్-బారే సిండ్రోమ్‌తో మరణించిన తొలి కేసుగా ఇది నమోదైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో జీబీఎస్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య ...




