Thandel Trailer | తండేల్ ట్రైలర్ ఆగయా..
                    Thandel Trailer Released |  అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న మూవీ తండేల్ (Thandel). కార్తికేయ సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చందు మొండేటి (chandhu mondeti) డైరెక్షన్లో నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai pallavi) హీరో,హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటివరకు విడుదలైన మూడు సాంగ్స్ కి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వారు వింటేజ్ దేవిశ్రీ ని(DSP ) చూస్తున్నామంటున్నారు. అంతలా డీఎస్పీ మ్యూజిక్ ఉంది.
ఇక ఈరోజు రిలీజ్ చేసిన ట్రైలర్ (Thandel Trailer ) సాయి పల్లవి డైలాగ్ తో మొదలవుతుంది. 'రాజు.. ఊర్లో అందరూ ఏటెటో మాట్లాడుకుంటున్నార్రా…'అని సాయి పల్లవి అనగానే 'మన గురించి మాట్లాడుతార్రు అంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే ' అని నాగచైతన్య డైల...                
                
             
								



