Sarkar Live

Day: January 29, 2025

Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి
Trending

Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి

Maha Kumbh Stampede | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభామేళాలో ఈ రోజు అప‌శ్రుతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా అమృత స్నానాన్ని ఆచ‌రించే సమయంలో తొక్కిస‌లాట జ‌రిగింది. గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బారికేడ్లు విరిగిప‌డి.. మౌని అమావాస్య సంద‌ర్భంగా అమృత స్నానానికి (Amrit Snan) కోట్లాది మంది భ‌క్తులు త్రివేణి సంగ‌మానికి త‌ర‌లివ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆ ప్ర‌దేశ‌మంతా కిక్కిరిసిపోవ‌డంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో గందరగోళం ఏర్పడి తొక్కిస‌లాట జ‌రిగింది. Maha Kumbh Stampede : ఆస్ప‌త్రుల్లో క్ష‌త‌గాత్రులు మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం కోసం సంగమానికి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది మరణించారని, ...
New IT parks in Hyderabad | రాష్ట్రంలో మ‌రో రెండు ఐటీ పార్కులు..
State

New IT parks in Hyderabad | రాష్ట్రంలో మ‌రో రెండు ఐటీ పార్కులు..

New IT parks in Hyderabad : హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో రెండు కొత్త ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైటెక్ సిటీ మాదిరిగా ఆధునిక మౌలిక సౌక‌ర్యాల‌తో వీటిని స్థాపించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister D Sridhar Babu) వెల్ల‌డించారు. దీనికి ప్ర‌త్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పార్కుల కోసం అనుకూలమైన ప్ర‌దేశాలను ఎంచుకొని అవసరమైన భూముల‌ను కేటాయించేందుకు ప్ర‌క్రియ‌ను ప‌క‌డ్బందీగా చేప‌డుతున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ముందుకొచ్చిన పెట్టుబ‌డిదారులు కొత్త‌గా ఏర్ప‌డ‌నున్న ఐటీ పార్కుల కోసం న‌గర పరిసర ప్రాంతాల్లో అనుకూలమైన భూముల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు తెలిపారు. ఉద్యోగులు, పెట్టుబడిదారులకు అనువైన ప్ర‌దేశాల‌నే ఎంచుకుంటామ‌ని చెప్పారు. ఈ మేర‌కు అమెరికాకు చెందిన డ్యూ సాఫ్ట్‌వేర్ కంపెనీ (‘Dew’ Software Comp...
Illegal Registrations | అక్రమ రిజిస్ట్రేషన్లకే రా”రాజు”
Special Stories

Illegal Registrations | అక్రమ రిజిస్ట్రేషన్లకే రా”రాజు”

ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న సబ్ రిజిస్ట్రార్ భాగోతాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఘనుడు.. Illegal Registrations in Khammam | స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం ఆయనకు టూ మినట్స్ న్యూడుల్స్ చేసినంత ఈజీ.. ఈ విషయంలో ఆ సబ్ రిజిస్ట్రార్ రూటే సప"రేటు"గా ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా వందలాది రిజిస్ట్రేషన్ లు చేయడంతో అక్రమ రిజిస్ట్రేషన్ లకే రా"రాజు" అని సదరు సబ్ రిజిస్ట్రార్ కు డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లు బిరుదు కూడా ఇచ్చారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District)లో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ గతంలో విధులు నిర్వహించిన చోట తన ఇష్టానుసారంగా అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. బదిలీల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్లిన అధికారి అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. సదరు అధికారి స్టైల్ మగధీర సినిమాలోని డైల...
MMTS Trains | చ‌ర్ల‌ప‌ల్లి స్టేషన్ కు చేరుకునేదెలా…?
State

MMTS Trains | చ‌ర్ల‌ప‌ల్లి స్టేషన్ కు చేరుకునేదెలా…?

MMTS Trains | విమానాశ్ర‌యం త‌ర‌హాలో అత్యాధునిక హంగుల‌తో అభివృద్ధిచేసిన చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్ (Charlapalli Railway terminal) ఇటీవ‌లే అందుబాటులోకి వ‌చ్చింది. ఇక్క‌డి నుంచి కొన్ని రైళ్ల‌ను కూడా ప్రారంభించింది ద‌క్షిణ మ‌ధ్ రైల్వే.. ప్ర‌యాణికుల‌తో పోటెత్తుతున్న సికింద్రాబాద్‌(Secunderabad), నాంప‌ల్లి, కాచిగూడ రైళ్లే స్టేష‌న్ల‌పై ఒత్త‌డిని త‌గ్గించేందుకుచ‌ర్ల‌ప‌ల్లి నుంచి మ‌రిన్ని రైళ్ల‌ను న‌డిపించాల‌ని భార‌తీయ రైల్వే ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. చర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌నుంచి 25 జతల రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. సికింద్రాబాద్ లో ఒత్తిడి తగ్గించి తొలిదశలో 10 జతల రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించ‌నుంది. కానీ ఇక్క‌డ ప్ర‌ధాన‌మైన స‌మస్య ఎదుర‌వుతోంది. చర్లపల్లికి క‌నెక్టివిటీకి అవసరమైన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పటివ‌ర‌కు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఎంఎంటిఎస్ ర...
error: Content is protected !!