Chiranjeevi : చిరు మూవీకి రాక్ స్టార్ మ్యూజిక్…?
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi ) సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం అనేది అందరి మ్యూజిక్ డైరెక్టర్లకు ఒక కల. తను ఇచ్చే మ్యూజిక్ లో మెగాస్టార్ స్టెప్పులు వేస్తే చాలు అనుకుంటారు. మెగాస్టార్ కెరియర్ స్టార్టింగ్ లో ఎక్కువగా చక్రవర్తి మ్యూజిక్ ఇచ్చేవారు. వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి.
ఖైదీ, యమకింకరుడు,జేబుదొంగ, చక్రవర్తి,వేట,అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, అడవి దొంగ, జేబుదొంగ,మంచి దొంగ ఇలా ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించాడు. అప్పటికి చక్రవర్తి టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మెగాస్టార్ సినిమాలకు వర్క్ చేయడం కూడా సినిమాలు హిట్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి.
ఇళయ రాజా కాంబినేషన్ లో..
తర్వాత ఇళయరాజా, మెగాస్టార్ కాంబినేషన్లో కూడా అనేక సినిమాలు వచ్చి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ రాక్షసుడు సినిమాలోని పాటలు ఫేవరెట్ గా అందరూ చెబుతుంటారు....




