Yadagiri Gutta | యాదగిరిగుట్టకు మహర్దశ.. టీటీడీ తరహాలో యాదగిరి ఆలయబోర్డు
Yadagiri Gutta Temple : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి (Yadagiri Gutta) ఆలయానికి మహర్దశ పట్టనుంది. త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రులు దేవాదాయశాఖ అధికారులతో కలిసి సమీక్షించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధర్మకర్తల మండలి ఏర్పాటు కోసం రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగానే యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయం (Yadadri LakshmiNarasimha swami temple ) సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు ఏమ...
