Thandel | తండేల్ కు పోటీగా పూరి సోదరుడు..
Thandel Movie సంక్రాంతికి బడా సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. మూడు సినిమాలు పెద్ద బ్యానర్ లోనే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ బడ్జెట్ తో వచ్చిన గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ దిల్ రాజు బ్యానర్ లో వచ్చింది. అలాగే సూర్య దేవర నాగవంశీ ప్రొడక్షన్ లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ కూడా మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం మూవీ దిల్ రాజు బ్యానర్ లోనే వచ్చి 300 కోట్ల రూపాయలను కొల్లగొట్టి ఇంకా ఫుల్ రన్ లో ఉంది. ఇక ఈ మూడు బడా సినిమాల హడావిడి తగ్గినట్టే..
Thandel Movie Release date : ఫిబ్రవరి 7న రిలీజ్
ఫిబ్రవరి 7న తండేల్ (Thandel) మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో నాగచైతన్య,సాయి పల్లవి(Naga Chaitanya, Sai Pallavi) జంటగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాసు (Banni vasu) ఈ మూవీని నిర్మిస్తున్నారు. పాటలతో, మొన్న ర...




