Sarkar Live

Day: February 3, 2025

Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప‌థ‌కంలో అనర్హుల గుర్తింపు షురూ..
State

Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప‌థ‌కంలో అనర్హుల గుర్తింపు షురూ..

Indiramma Atmiya Bharosa Scheme : రాష్ట్ర ప్రభుత్వం వ్య‌వ‌సాయ రైతు కూలీల కోసం ప్ర‌త్యేకంగా ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విషయం తెలిసిందే.. ఈ స్కీమ్‌ కింద రైతు కూలీల‌కు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయాన్ని రెండు విడ‌త‌లుగా అందించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో వివ‌రాల న‌మోదుకు ఇప్ప‌టికే గ‌డువు పూర్త‌యింది. గ్రామ సభలు, మండల కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,24,487 కొత్త ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దాదాపు సుమారు 6 లక్షల మందిని లబ్ధిదారులను ఎంపిక చేసింది. కొత్తగా వ‌చ్చిన 2,24,487 అప్లికేష‌న్ల‌లో 19,193 ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించారు. 1,44,784 ద‌ర‌ఖాస్తులు తిర‌స్క‌ర‌ణ‌కు గురయ్య‌యాయి. మరో 59,542 దరఖాస్తుల‌ను పెండింగ్‌లో పెట్టారు. ఇందిరమ్మ...
Jewar International Airport | ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం..
Trending

Jewar International Airport | ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం..

ఢిల్లీకి సమీపంగా ఉత్తర ప్రదేశ్‌లో నోయిడా వ‌ద్ద నిర్మితమవుతున్న జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయం (Jewar International Airport) ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా నిలవనుంది. ఏప్రిల్ 2025 నుంచి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంద‌ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Civil Aviation Minister Rammohan Naidu) రాజ్యసభలో వెల్లడించారు. ఇది ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సేవ‌లు అందిస్తుంద‌ని వెల్ల‌డించారు. ఉత్సుక‌త చూపుతున్న ఎయిర్‌లైన్స్‌లు జేవ‌ర్ విమానాశ్రయం ప్రారంభం కాకముందే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ వంటి ఎయిర్‌లైన్స్‌లు తమ సేవలను ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. ఈ ఎయిర్‌పోర్ట్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని అందించనుంది. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేకు చాలా దగ్గరగా ఉండటంతో ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, అగ్రా, లక్నో వంటి ప్రధాన నగరాల నుంచి ప్రయాణం మరి...
Chandrababu Naidu | ధ‌నిక దేశంగా భార‌త్.. 2047 కల్లా సాధ్యం
State

Chandrababu Naidu | ధ‌నిక దేశంగా భార‌త్.. 2047 కల్లా సాధ్యం

Chandrababu Naidu On Visksit Bharat | భార‌త‌దేశం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంద‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని కొనియాడారు. దీంతో 2047 నాటికి అభివృద్ధి చెంది ధనిక‌ దేశంగా భార‌త్ ఖ్యాతిని సంపాదించుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కేంద్ర బ‌డ్జెట్ భేష్ ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు కోసం ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు అక్క‌డి మీడియాతో మాట్లాడ‌టంతోపాటు ప‌లు కార్య‌క్ర‌మాల్లో ప్రసంగించారు. 2025 కేంద్ర బడ్జెట్ (Union Budget 2025)ను ఆయన అభినందించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (MSMEs), గ్రామీణ అభివృద్ధి, పెట్టుబడి విధానాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింద‌ని, దీని ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. పన్ను మినహాయింపు పరిమ...
KTR | ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంకు కేటీఆర్.. విచార‌ణ వాయిదా
State

KTR | ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంకు కేటీఆర్.. విచార‌ణ వాయిదా

భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR ) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ (Congress Party)లో చేరిన నేపథ్యంలో వీరిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. కేటీఆర్‌ వేసిన పిటిషన్‌పై ఈ రోజు (సోమవారం) సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో విచార‌ణ ఇలా.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను విచారించాల‌ని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం నిర్ణయించింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి క...
ISRO NVS 02 | మొరాయించిన ఉప‌గ్ర‌హం.. ఇస్రోకు ఊహించని స‌వాళ్లు
Technology

ISRO NVS 02 | మొరాయించిన ఉప‌గ్ర‌హం.. ఇస్రోకు ఊహించని స‌వాళ్లు

ISRO NVS 02 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO ) జనవరి 29, 2025న తన 100వ ప్రయోగంగా జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-2 (GSLV Mk-II) ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇది NavIC (Navigation with Indian Constellation) వ్యవస్థలో కీలక ఉపగ్రహం. అయితే.. ఇస్రోకు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయత్నం విఫ‌ల‌మైంది. క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించ‌ని NVS-02 NVS-02 ఉపగ్రహాన్ని భారతదేశ సొంత‌ నావిగేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించారు. ముఖ్యంగా రక్షణ, ఆర్థిక, కమ్యూనికేషన్, విపత్తు నిర్వహణ, వ్యవసాయ రంగాలకు కీలకమైన సమాచారాన్ని అందించే సామ‌ర్థ్యం ఇందులో ఉంది. ఈ ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించలేకపోవడంతో ఈ ప్రయోజనాలపై అస్పష్టత ఏర్పడింది. NVS-02 అసలు సమస్య ఏమిటి? ISRO NVS 02 ఉపగ్రహాన్ని నిర్దే...
error: Content is protected !!