Vidaamuyarchi | అజిత్ మూవీ మేకర్స్ పట్టుదలతో లేరా..
తమిళ స్టార్ హీరో అజిత్(Ajith) నుంచి వస్తున్న మూవీ విదాముయార్చి(Vidaamuyarchi). ఈ మూవీ తెలుగులో పట్టుదల అనే పేరుతో రిలీజ్ కాబోతోంది. గ్లామర్ క్వీన్ త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాలవల్ల విడుదల కాలేదు. ఈనెల 6న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఆ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ గ్రాండ్ గా ఉన్నాయి. అజిత్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టారు. ట్రైలర్ తో ఈ మూవీపై సూపర్ బజ్ ఏర్పడింది.
కానీ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సందడి మాత్రం లేదు. ఒక మూవీ రిలీజ్ కి ముందు ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్లు కలిసి మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూ లు ఇస్తారు. అందులో హైలెట్స్ ని చెబుతూ ప్రేక్షకులు ఆ మూవీ ఎందుకు చూడాలో, అందులో ఏముందో చెప్పి వారిలో మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తారు...

