Beer Price Hike | బీర్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు
Beer Price Hike : తెలంగాణ రాష్ట్రంలో బీర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏకంగా 15 శాతం మేర రేట్లను పెంచుతూ ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ధరలు నేటి నుంచే (2025 ఫిబ్రవరి 11) అమల్లోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని డిపోలు, ట్రాన్సిట్‌లో ఉన్న బీర్లకు కొత్త ధరలు (Beer new prices) వర్తించనున్నాయి.
Reasons Beer Price Hike : ధరల పెంపునకు కారణాలు
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉత్పత్తి చేసిన బీర్ ధరలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రధానంగా ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకే బీర్ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొంతమంది తయారీదారుల గణాంకాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వాలు వ్యాపారంలో లోగడ బీర్ ధరలపై జరుగుతున్న మార్పులను అనుసరించడానికి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇందు...




