Vijay Devarakonda | అదరిపోయేలా విజయ్ దేవరకొండ మూవీ టీజర్..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్న నూరి (Goutham thinnanoori) డైరెక్షన్లో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగదేవర సూర్యవంశి,సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ కింగ్ డమ్ (Kingdom) అనే టైటిల్ ఖరారు చేస్తూ టీజర్ ను కూడా రిలీజ్ చేసింది. తెలుగు,హిందీ తమిళ్ లో ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళ్ లో సూర్య(Surya), హిందీలో రణబీర్ కపూర్ (Ranbeer kapoor) వాయిస్ ఓవర్ ఇచ్చారు.
తెలుగులో ఎన్టీఆర్ (NTR) వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే గుర్తుండి పోయేలా మూవీ నిలుస్తుంది అనిపిస్తుంది. ఇటీవల తను చేసిన మూవీస్ వరుసగా ప్లాప్ అయ్యాయి. దానికి చెక్ పెట్టేలా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టు గ్యారెంటీ అనేలా టీజర్ కట్ చేశారు. విజయ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల...




