Sarkar Live

Day: February 13, 2025

Allu Arjun | అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్యలో అట్లీ…?
Cinema

Allu Arjun | అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్యలో అట్లీ…?

పుష్పతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తర్వాత ఏ సినిమా చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో తన తర్వాతి మూవీ చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ కూడా స్పష్టత లేదు. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నా మూవీ టీం ఇంకా ఫైనలైజ్ అయినట్లు ప్రకటించలేదు. పుష్ప-2కు ముందే అట్లీ (Atlee) డైరెక్షన్లో అల్లు అర్జున్ మూవీ చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది పట్టాలకెక్కలేదు. దీంతో అల్లు అర్జున్ వేరే సినిమాలకు కమిట్ అయ్యాడు. అట్లీ కూడా తన సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప -2 (Pushpa-2) బిగ్గెస్ట్ హిట్టు తో తన రేంజ్ మారిపోయింది. అట్లీ కూడా షారుక్ ఖాన్ (sharukh Khan) హీరోగా జవాన్ మూవీ తీసి వరల్డ్ వైడ్ గా స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు అట...
AI నాలెడ్జ్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌ : సీఎం రేవంత్‌రెడ్డి
State

AI నాలెడ్జ్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌ : సీఎం రేవంత్‌రెడ్డి

మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా తెలంగాణ యువ‌త‌కు భారీ ఉద్యోగావకాశాలు ల‌భిస్తాయ‌ని ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) అన్నారు. హైద‌రాబాద్‌లో కృత్రిమ మేధ (AI) మైక్రోసాఫ్ట్ (Microsoft), రాష్ట్ర‌ ప్ర‌భుత్వం సంయుక్తంగా అడ్వాంటేజ్ తెలంగాణ పేరుతో AI ఫౌండేషన్ అకాడమీని ప్రారంభించాయ‌ని తెలిపారు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ కొత్త కార్యాల‌య భ‌వనాన్ని సీఎం ఈ రోజు (గురువారం) ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించడంతో యువ‌త‌కు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్ర రాజ‌ధానిలో మైక్రోసాఫ్ట్ సంస్థ త‌న‌ రెండో కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం ఐటీ రంగ అభివృద్ధిలో ఒక మైలురాయి అని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ ఐటీ దిగ్గజం హైదరాబాద్ నుంచి నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల ద్వారా ప్ర‌పంచ వ్యాప్త సేవ‌లు అందించ‌డం గర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ...
Waqf Amendment Bill | రాజ్య‌స‌భలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు.. తీవ్ర వాగ్వాదం
National

Waqf Amendment Bill | రాజ్య‌స‌భలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు.. తీవ్ర వాగ్వాదం

Waqf Amendment Bill : వ‌క్ఫ్‌ సవరణ బిల్లును రాజ్య‌స‌భ‌లో ఈ రోజు ప్ర‌వేశ‌పెట్టారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదికను స‌మ‌ర్పించ‌గా సభ (Rajya Sabha)లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాము క‌మిటీ ఎదుట వ్య‌క్త‌ప‌రిచిన అభ్యంత‌రాల‌ను జేపీసీ నివేదిక నుంచి తొల‌గించార‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ స‌భ్యులు ఆరోపించారు. ఇది ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు విరుద్ధ‌మ‌ని కాంగ్రెస్ మండిప‌డింది. దీన్ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి కిర‌ణ్ రిజిజు (Kiren Rijiju) ఖండించారు. జేపీసీ (joint committee of Parliament) నివేదిక నుంచి ఏ భాగం కూడా తొల‌గించ‌లేద‌ని, ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నార‌ని అన్నారు. ఇరుప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం ప్ర‌తిప‌క్ష నేత‌ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే (Mallikarjun Kharge) రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికలో అనేక మంది సభ్యులు తమ అభ్యంత‌రాల‌ను వ్య‌క్...
Valentines Day | ప్రేమికుల రోజు.. విచిత్ర కానుక‌లు.. ఏ దేశంలో ఎలాంటివంటే..
LifeStyle

Valentines Day | ప్రేమికుల రోజు.. విచిత్ర కానుక‌లు.. ఏ దేశంలో ఎలాంటివంటే..

Valentines Day : ప్రేమ అనేది ఒక భావన మాత్రమే కాదు.. హృదయాన్ని హత్తుకునే గొప్ప అనుభూతి. ప్రేమంటే.. ఒకరిని మరొకరు సమర్థించుకోవడం, ఆదరించడం, అర్థం చేసుకోవడం, సమయం కేటాయించడం. కేవలం మాటల్లోనే చెప్పలేనిది, హృదయంతో మాత్రమే అర్థం చేసుకోగలిగేదే ప్రేమ‌. నిజమైన ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. ఎలాంటి పరిమితులు లేకుండా రెండు మ‌నసుల‌ను కలిపే శక్తిని కలిగి ఉంటుంది. ప్రేమ‌కూ ఓ ప్ర‌త్యేక రోజు మానవ సంబంధాల్లో ప్రేమకు ప్రథమ స్థానముంది. తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, సొంత వ్యక్తుల మధ్య ప్రేమ ఇలా అనేక ర‌కాలు. ఇందులో ప్రతి ఒక్కదానికీ ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రపంచం ప్రేమ వల్లే ముందుకు సాగుతోంది. అయితే.. ప్రేమంటే రెండు మ‌న‌సుల మ‌ధ్య క‌లిగే ఒక మ‌ధురానుభూతి మాత్ర‌మేన‌నే అభిప్రాయం ప్ర‌తి ఒక్క‌రిలోనూ బ‌లంగా నాటుకుపోయింది. మ‌న‌కు న‌చ్చిన వ్య‌క్తికి ద‌గ్గ‌ర కావ‌డ‌మే ప్రేమ అనుకుంటారు ...
PM Modi US visit | అమెరికాలో మోదీ.. కీల‌క ఒప్పందాలు
World

PM Modi US visit | అమెరికాలో మోదీ.. కీల‌క ఒప్పందాలు

PM Modi US visit : ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. నిన్న (బుధ‌వారం) వాషింగ్ట‌న్ డీసీ (Washington DC)కి చేరుకున్న ఆయ‌న అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ (Tulsi Gabbard)తో భేటీ అయ్యారు. భారత్-అమెరికా మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ పర్యటనకు ముందు ఫ్రాన్స్‌లో రెండు రోజుల పర్యటనను ముగించారు. అక్కడి నుండి నేరుగా అమెరికాకు (PM Modi US visit) చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ఇతర అధికారులు మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కీల‌కాంశాలపై ఒప్పందాలు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) అమెరికా అధ్య‌క్షుడిగా రెండోసారి బాధ్య‌తలు స్వీక‌రించిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ ఆ దేశంలో తొలిసారిగా ప‌ర్య‌టిస్తున్నారు. ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆయ...
error: Content is protected !!