JioHotstar : విలీనమైన జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్.. కొత్త ఓటీటీలో ఉచితంగా కంటెంట్!
JioHotstar : దేశంలోనే రెండు ప్రసిద్ధ ఓటీటీ (OTT) స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లు విలీనమయ్యాయి. జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ ఒక్కటయ్యాయి. ఈ రెండింటి విలీనంతో ఆన్‌లైన్ ప్రేక్షకులు జియోహాట్‌స్టార్(JioHotstar) రూపంలో మరింత ఎక్కువ కంటెంట్ ను ఆస్వాదించవచ్చు. జియో, హాట్‌స్టార్ రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న కాంటెంట్‌ను ఒకే వేదికపై వీక్షించవచ్చు. లేటెస్ట్ సినిమాలతోపాటు స్పెషల్ షోలు, సిరీస్‌లు చూడవచ్చు. ఇతర అంతర్జాతీయ స్టూడియోలు, స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లకు చెందిన కాంటెంట్‌ను కూడా జియో హాట్‌స్టార్‌లో టెలీకాస్ట్ కానున్నాయి.
జియోహాట్‌స్టార్‌ను ప్రారంభిస్తున్నట్లు జియోస్టార్ పేర్కొన్నది. కొత్త స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన వివరాలను సైతం వెల్లడించింది. కాగా రెండు ప్రముఖ ఫ్లాట్‌ఫామ్‌లు కలవడంతో దాదాపు మూడు లక్షల గంటల కాంటెంట్ యూజర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. మరోవ...



