Strong earthquake | ఢిల్లీలో భూకంపం.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా?
Strong earthquake In Delhi | దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ప్రజలు నిద్రలో ఉండగా 5:36 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0గా దీని తీవ్రత నమోదైంది. జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం (National Center for Seismology - NCS) ప్రకారం భూకంపం 28.59 ఉత్తర అక్షాంశం (latitude), 77.16 తూర్పు రేఖాంశం (longitude) వద్ద రికార్డయ్యింది. ఈ భూకంపం భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉద్భవించింది.
Strong earthquake : పరుగులు తీసిన ప్రజలు
ఈ భూకంపం తీవ్రత ఢిల్లీ నగరంతోపాటు నోయిడా, ఇందిరాపురం, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్ తదితర ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం ఐదారు సెకన్ల పాటు మాత్రమే కొనసాగినప్పటికీ దాని తీవ్రత ప్రజలను ఉలికిపడేలా చేసి...


