Salaries in India | భారత్‌లో జీతాల సగటు పెరుగుదల 9.2%.. ఎందుకంటే..
Salaries in India : భారతదేశంలోని ప్రైవేటు రంగంలో ఉద్యోగుల జీతాలు 2025లో సగటున 9.2 శాతం పెరుగుతాయట! 2024లో 9.3 శాతం పెరుగుదలతో పోలిస్తే ఇది స్వల్ప తగ్గుదల. ముఖ్యంగా తయారీ రంగం, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs)లో వేతనాల్లో ఈ ప్రభావం ఉంటుందని 'సాలరీ ఇన్‌క్రీస్ అండ్ టర్నోవర్ సర్వే 2024-25 ఇండియా' బుధవారం వెల్లడించిన నివేదికలో పేర్కొంది. 2022లో కంపెనీలు 'గ్రేట్ రిజిగ్నేషన్' ప్రభావంతో 10.6 శాతం జీతాల పెరుగుదల ఉండగా, అప్పటి నుంచి తగ్గుదల ధోరణి కనిపిస్తోంది. 2025లో 9.2 మాత్రమే వేతనాల పెరుగుదల ఉంటుందని నివేదిక చెబుతోంది. 45 పరిశ్రమల్లోని 1,400కి పైగా కంపెనీల డేటాను అధ్యయనం అనంతరం ఈ వివరాలను వెల్లడించారు.
Salaries in India : కారణాలు.. ప్రభావం
వేతనాల పెరుగుదల ( Salaries Hike ) అనేది పరిశ్రమల వారీగా వేరుగా ఉంటాయని నివేదిక చెబుతోంది. ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్, ఆటోమొబైల్...


