BioAsia 2025 | హైదరాబాద్‌లో కీలక సదస్సు.. స్టార్టప్‌ల గ్లోబల్ ప్లాట్‌ఫాం
BioAsia 2025 | ఆసియాలోనే అతిపెద్ద జీవ విజ్ఞాన, ఆరోగ్య సంరక్షణ సదస్సు బయో ఏషియా- 2025. ఫిబ్రవరి 25 నుంచి 26 వరకు హైదరాబాద్ ( Hyderabad)లో ఇది జరగనుంది. స్టార్టప్ (startups)లు, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికోత్పత్తికి గ్లోబల్ వేదికను ఇది అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.
BioAsia 2025 : ప్రత్యేక ఆకర్షణగా ఇన్నోవేషన్ జోన్
ఈ సదస్సులో ఇన్నోవేషన్ జోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో స్టార్టప్ పావిలియన్, ఇన్క్యుబేటర్ పావిలియన్ ఉంటాయి. ఇవి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి, పెట్టుబడి అవకాశాలను ఆకర్షించేందుకు దోహదపడతాయి. ఈ సదస్సులో సుమారు 80 స్టార్టప్‌లు తమ అత్యాధునిక పరిష్కారాలను ప్రదర్శించే ప్రత్యేక అవకాశాన్ని పొందనున్నాయి. ఇవి గ్లోబల్ ఆరోగ్య సంరక్షణను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ కార్యక్రమానికి...




