Centre to help red chilli farmers | ఏపీ మిర్చికి మద్దతు ధర.. శుభవార్త చెప్పిన కేంద్రం
Centre to help red chilli farmers : ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతుల (chilli farmers)కు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్‌లో ధర పడిపోతున్న దృష్ట్యా వారికి బాసటగా నిలిచేందుకు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (MIS) ద్వారా మద్దతు ధర కల్పించనుంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ (Union Agriculture Minister Shivraj Singh Chouhan) ప్రకటించారు.
సీఎం చంద్రబాబు విజ్ఞప్తిపై సానుకూల స్పందన
ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుల (chilli farmers) కు సహాయం అందించాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister N Chandrababu Naidu) కోరారు. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్‌తో చర్చించారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ఏపీ రైతులకు మద్దతుగా నిలుస్తామ...
