BuildNow | భవన నిర్మాణాల అనుమతులకు కొత్త విధానం
BuildNow : కొత్త భవనాలు నిర్మించాలంటే అనుమతులు పొందడం తప్పనిసరి. ఎంతో కీలకమైన ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే వేచి చూడాల్సిందే. ఇలా పర్మిషన్లు పొందడంలో ఆలస్యం కావడం వల్ల భవ నిర్మాణదారులు ఇబ్బంది పడక తప్పని పరిస్థతి. అలాగని ఏమాత్రం లేటు చేయకుండా ఇచ్చే పర్మిషన్లలో పారదర్శకత లోపించేది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు అత్యాధునిక సాంకేతిక విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ‘బిల్డ్‌నౌ’ (BuildNow) అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత యూనిఫైడ్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఈ ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశీలన
భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ముందు చేపట్టాల్సిన పరిశీలన తదితర ప్రక్రియను వేగవంతం చేయడా...

