Ratan Tata Road | హైదరాబాద్‌లో రతన్ టాటా స్మారక రోడ్డు.. రంగం సిద్ధం
TG Govt to build Ratan Tata Road : ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటా స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఓ కొత్త రహదారిని నిర్మించనుంది. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టి హైదరాబాద్ రింగ్ రోడ్డు (ORR)లోని రావిర్యాల్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (RRR) లోని అమనగల్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా అనుసంధానం చేయనుంది. ఈ కొత్త రహదారికి రతన్‌టాటా రోడ్ అని నామకరణం చేయనుంది.
Ratan Tata Road : రూ. 4,030 కోట్ల వ్యయం
రతన్ టాటా స్మారక గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డును సుమారు రూ. 4,030 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. మొత్తం 41.50 కిలోమీటర్ల పొడవుతో ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టనుంగా రెండు దశల్లో పనులు సాగనున్నాయి. మొదటి దశలో ORR లోని రావిర్యాల్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.2 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతుంది, దీని కోసం రూ....


