Sabdham review | శబ్దం మూవీ రివ్యూ…
Sabdham review Telugu | వైవిధ్యమైన స్టోరీస్ తో ఆడియన్స్ ను అలరించే ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) తెలుగులో హీరో కంటే విలన్ గా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు తో విలన్ గా బయపెట్టగా, రామ్ చరణ్ రంగస్థలంలో అన్నగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ప్రజెంట్ చాలా మూవీస్ చేస్తున్న Akhanda-2 లో విలన్ గా మరోసారి అలరించనున్నాడు. తను హీరోగా నటిస్తున్న కొన్ని మూవీస్ సెట్స్ పై ఉండగా ఈ రోజు వైశాలి ఫేమ్ అరివలగన్ (Arivalagan) డైరెక్షన్ లో శబ్దం(Sabdham) మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో లక్ష్మీమీనన్, సిమ్రాన్, లైలా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. మరి ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం….
కథ విషయానికి వస్తె..
ఒక మెడికల్ కళాశాల లో అనుమానస్పద స్థితిలో కొందరు స్టూడెంట్స్ ఆత్మహత్య లు చేసుకుంటారు.ఈ కాలేజీలో దెయ్యాలు ఉండడం వల్లనే ఇదంత జరుగుతుందనే అనుమానం కొందరికి కల...




