LPG Prices | కమర్షియల్ LPG ధరల పెంపు.. మీ నగరంలో తాజా ధరలపై లుక్కేయండి..
LPG Prices Hike | భారతదేశం అంతటా కమర్షియల్ LPG సిలిండర్లపై చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ.6 పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1,797 నుంచి రూ.1,803కి పెరిగింది, అయితే 14.2 కిలోల దేశీయ LPG సిలిండర్ల ధరలు ఆగస్టు 2024 నుంచి ఇప్పటివరకు పెంచకపోకవడం సామాన్యలకు ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు.
ఐదేళ్లలో మార్చి 1న అతి తక్కువ పెంపు
ఈ సంవత్సరం రూ.6 పెరుగుదల తర్వాత గత ఐదు సంవత్సరాలలో మార్చి 1న నమోదైన అతి తక్కువగా ధర పెంచాయి చమురు కంపెనీలు.. . దీనికి విరుద్ధంగా, మార్చి 2023లో సిలిండర్‌కు ఏకంగా రూ.352 బాగా పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌కు బడ్జెట్ రోజున రూ.7 స్వల్ప ఉపశమనం ఉన్నప్పటికీ, తాజా సవరణతో మళ్లీ పాత ధరకే చేరినట్లయింది.
LPG Prices : తాజా కమర్షియల్ LPG ధరలు - నగరాల వారీగా వివరాలు
LPG Commercial Cylinder Prices :...
