Sarkar Live

Day: March 2, 2025

ఏపీలో TG EAPCET సెంట‌ర్లు ఇక ఉండ‌వు… ర‌ద్దు చేసిన JNTU
career

ఏపీలో TG EAPCET సెంట‌ర్లు ఇక ఉండ‌వు… ర‌ద్దు చేసిన JNTU

TG EAPCET 2025 : తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈసారి ప‌రీక్ష కేంద్రాలు ఉండ‌వు. వాటిని ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ప్ర‌క‌టించింది. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు ఈ ప‌రీక్ష కేంద్రాల‌ను తొల‌గిస్తున్నామ‌ని పేర్కొంది. రిజ‌ర్వేష‌న్ల నేపథ్యంలో మార్పు తెలంగాణ ప్రభుత్వం 15% నాన్ లోకల్ సీట్లు రద్దు చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఈ సీట్ల కోసం పోటీ పడేవారు. ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయింది.ఇప్పటివరకు ప్రతి ఏడాది TG EAPCETలో సుమారు 55 వేల మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పాల్గొనేవారు. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరు...
Protests against Elon Musk | టెస్లా కార్యాల‌యాల వ‌ద్ద నిర‌స‌న‌లు.. ఎందుకంటే..
World, Business

Protests against Elon Musk | టెస్లా కార్యాల‌యాల వ‌ద్ద నిర‌స‌న‌లు.. ఎందుకంటే..

Protests against Elon Musk : టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk )కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిర‌స‌న‌లు ఉధృత‌మ‌య్యాయి. వివిధ న‌గ‌రాల్లోని టెస్లా డీల‌ర్‌షిప్ కార్యాల‌యాల (stores) ఎదుట ఈ రోజు పెద్ద ఎత్తున బ‌హిరంగ ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఉన్న స‌న్నిహిత సంబంధాల నేప‌థ్యంలో రాజ‌కీయ రంగంలో మ‌స్క్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై నిర‌స‌న‌లు వ్య‌క్త‌మవుతున్నాయి. ఎలాన్ మ‌స్క్ రాజ‌కీయ జోక్యం ఎలాన్ మస్క్ ((Elon Musk) కొంతకాలంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ వ‌స్తున్నారు. ఫెడరల్ ఏజెన్సీల (federal agencies)ను పునర్‌వ్యవస్థీకరించాల్సిన ఆవ‌శ్య‌త‌క‌ను కూడా ప్రముఖంగా సూచిస్తున్నారు. ట్రంప్ ప‌రిపాల‌న విధానాల‌ను అనుస‌రించేలా మ‌స్క్ అభిప్రాయాలు ఉండ‌టంతో రాజకీయంగా ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త పెరిగింది. ఇందులో భాగంగ...
ATM loot | రూ. 30 ల‌క్ష‌ల అప‌హ‌ర‌ణ‌..  క‌ల‌కలం రేపిన ఏటీఎం చోరీ
Crime

ATM loot | రూ. 30 ల‌క్ష‌ల అప‌హ‌ర‌ణ‌.. క‌ల‌కలం రేపిన ఏటీఎం చోరీ

ATM loot : హైదరాబాద్ (Hyderabad) శివారు రావిరాల (Ravirala village)లో శ‌నివారం రాత్రి భారీ చోరీ జ‌రిగింది. ఏటీఎం (ATM)ను ధ్వంసం చేసిన దుండ‌గులు రూ. 30 ల‌క్ష‌ల న‌గ‌దును అప‌హ‌రించారు. ప‌టిష్ట రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పటికీ సాంకేతికతను ఉపయోగించి దొంగ‌త‌నం చేశారు. ఈ సంఘటన తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఎలాంటి హ‌డావిడి లేకుండా.. ఎంతో జాగ్ర‌త్త‌గా.. రావిరాలలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం దగ్గర రాత్రివేళ దుండగులు చోరీకి పాల్పడ్డారు. మొత్తం నలుగురు కారులో వచ్చి ముందుగా పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఎవరైనా గస్తీ తిరుగుతున్నారా? ఎవరైనా చూస్తున్నారా? అనే విషయాన్ని ప‌రిశీలించారు. అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ముందుగా సీసీ కెమెరాలను పని చేయకుండా చేయడానికి కెమికల్ స్ప్రే ఉపయోగించారు. ఇది కెమెరా లెన్స్‌ను మసకబార్చి, ఏ విధంగా కూడా దృశ్యాలను రికార్డ్ కాకుండా చేస్తుంది. ఈ పని అయిపోయిన తర్వాత వారు ఏటీఎం...
Stock market | మార్కెట్ అస్థిరంగా ఉన్నా.. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు అనుకూల‌మే!
Business

Stock market | మార్కెట్ అస్థిరంగా ఉన్నా.. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు అనుకూల‌మే!

Stock market : స్టాక్‌ మార్కెట్ ఎల్లప్పుడూ ఒడిదొడుకులతోనే ఉంటుంది. ఈ నేప‌థ్యంలో తాజా మార్కెట్ ప‌రిస్థితులు, ఆర్థిక వృద్ధిప‌రంగా ప‌రిశీలిస్తే భారతీయ పెట్టుబడిదారుల (investors) కు ఇది చాలా కీలక సమయం అని ఉంటున్నారు విశ్లేష‌కులు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ (Stock market) అస్థిరతను లాభదాయక అవకాశంగా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. ఆర్థిక వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత మార్కెట్ అమ్మకాలు తాత్కాలికమేనని అంటున్నారు. స్థిరమైన కంపెనీల్లో పెట్టుబడులతో మంచి రాబడి భారత మార్కెట్ (Stock market) ప్రస్తుతం కొంతవరకు అస్థిరంగా కనిపిస్తున్నా, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి అవకాశాలున్నాయి. మార్కెట్ పతనం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టమే. అయితే.. గ‌త అనుభవాలను పరిశీలిస్తే, ప్రతి తక్కువ స్థాయిలోకి వచ్చిన మార్కెట్ మళ్లీ పెరిగిన రికార్డులూ ఉన్నాయి. త్వరలోనే వడ్డీ రేట్ల తగ్గింపు మరింతగా అమల్లోకి వస్త...
Almond Benefits | బాదం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా ? 100 గ్రాముల్లో ఏయే పోష‌కాలు ఉన్నాయి.?
LifeStyle

Almond Benefits | బాదం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా ? 100 గ్రాముల్లో ఏయే పోష‌కాలు ఉన్నాయి.?

Almond Benefits | ఆరోగ్యం విషయానికి వస్తే, బాదం పేరు మొదట వస్తుంది. దీనిని ప్రకృతి నిధి లేదా సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బాదంపప్పులో ఉండే పోషకాల సమృద్ధి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 100 గ్రాముల బాదంపప్పులో చాలా పోషకాలు ఉన్నాయని, వాటిని లెక్కించడానికి మీరు అలసిపోతారని నిపుణులు చెబుతుంటారు. రండి, ఈ చిన్న ఎండిన డ్రైఫ్రూట్ లో మీ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం. Almond Benefits : పోషకాల నిధి బాదం పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, 100 గ్రాముల బాదం పప్పులో దాదాపు 576 కేలరీల శక్తి ఉంటుంది. ఇది ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. ఇందులో దాదాపు 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కాకుండా, ఇందులో 49 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి ఎక్కువగా మోనోశాచురేటెడ్ కొవ్వులు. ఈ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. బాదంపప్పులో 12 గ్రాముల ఫైబర్ కూడా ఉంటుంది,...
error: Content is protected !!