Nala Conversion | నాలా కన్వర్షన్ కిం(సిం)గ్
ఒక్కో ప్లాటుకు ఒక్కో రేటు..
నాన్ లేఅవుట్ వెంచర్ లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేస్తున్న తహశీల్దార్
రియల్టర్ లకు సహకారం… ప్రభుత్వ ఆదాయానికి గండి
Nala Conversion in Warangal | అవును ఇప్పుడు ఆ తహసీల్దార్ నాలా కన్వర్షన్ కిం(సిం)గ్ గా పేరు పొందినట్లు రెవెన్యూ శాఖ (Revenue Deportment)లో ప్రచారం జరుగుతోంది. అనుమతి లేని వెంచర్లు చేసే రియల్టర్లకు ఆ తహసీల్దార్ పెద్దదిక్కుగా మారినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో అనుమతి లేని వెంచర్లలోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఆ తహసీల్దార్ (Tahsildar) కు బాగానే కలిసొస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేయడం ద్వారా సదరు తహశీల్దార్ బాగానే వెనకేసినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వ అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేస్తూ రియల్టర్ లకు సహకరిస్తున్న ఆ అధికారి పరోక్షం...




