Nirmal | కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో అగ్ని కీలలు.. మంటల్లో జీవరాసులు
Nirmal Forest | తెలంగాణలోని నిర్మల్ (Nirmal) జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ (Kawal Tiger Reserve)లోని ఉదుంపూర్ ఫారెస్ట్ రేంజ్‌లోని మైసంపేట్ సెక్షన్‌లో అడవి కాలిపోయింది. కారుచిచ్చు చెలరేగి ఉవ్వెత్తున మంటలు సంభవించాయి. దీంతో భారీగా వృక్ష సంపద నాశనమైంది. ఈ ప్రమాదంలో అనేక వన్యప్రాణులు (wildlife) కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దీంతో ఫారెస్టు అధికారులు, పర్యావరణ ప్రేమికులు, జంతు సంరక్షకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటి?
ఈ అగ్ని ప్రమాదానికి పశువుల కాపరులు, ఆక్రమణదారులే ప్రధాన కారణమని ఫారెస్టు అధికారులు (Forest officials) అనుమానిస్తున్నారు. కొందరు కాపరులు తమ పశువులను మేత కోసం అడవుల్లోకి తీసుకువెళ్లినప్పుడు బీడీ, చుట్టా తాగి పడేయడం వల్ల పొడిగా ఆకులు, చిన్న చిన్న మొక్కలకు నిప్పు అంటుకొ...

