Graduate MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం
Graduate MLC Elections : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి అంజిరెడ్డి ఎట్టకేలకు విజయం సాధించారు. మూడు రోజులుగా కౌంటింగ్ మారథాన్ ముగిసింది. మొదటి ప్రాధాన్యత వోట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి (Anji Reddy) విజయం సాధించారు. కాగా ఈవిషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలవగా, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో ఉన్నారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది.
కాగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం మూడోరోజు ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 వోట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 వోట్లు వచ్చాయి. బీఎస్ప...




