Cabinet meeting | రాష్ట్రంలో 10,950 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్
ఉగాది నుంచి భూభారతి అమలు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా మంత్రి వర్గ భేటీ
Telangana Cabinet meeting | తెలంగాణ రెవెన్యూ శాఖ బలోపేతానికి రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. ఇందు కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికొక క్షేత్రస్థాయిలో అధికారి ఉండేలా క్యాబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా కొత్తగా ఏర్పడిన డివిజన్లు, మండలాలకు సైతం కొత్తగా పోస్టులను మంజూరు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు సైతం ఆమోద ముద్ర వేసింది.హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. విస్తరణ తర్వాత హెచ్ఎండిఎ పరిధిలో 11 జిల్లాలు 1355 గ్రామాలు 332 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. రాష్ట్రంలోని 10,950 గ్రామాలకు క్షేత్ర స్థాయి అధికారుల నియమానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కొత్త డివిజన్లు, మండలాలకు 217 పోస్టుల...




