Off day schools | విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు
Off day schools In Telangana | తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు (Off day schools) నిర్వహించాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 15 నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలను నిర్వహించనున్నారు.
మరోవైపు పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం నుంచి తరగతులను నిర్వహిస్తారు. అనంతరం అన్ని స్కూళ్లలో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు (summer holidays) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఈ సంవత్సరం ముందస్తుగానే ఎండలు ఉధృతం కావడంతోఒక పూట బడులను సూతం ముందస్తుగానే నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ స...


