KCR | లక్షలాది మందితో వరంగల్‌లో భారీ బహిరంగ సభ.. ప్రకటించిన కేసీఆర్!
Ex CM KCR Meeting in Erravalli : బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ (K) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఉద్యమాల గడ్డ ఓరుగల్లు (Warangal)లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కనీవినీ ఎరుగుని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు వరంగల్ సమీపంలో విశాలమైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయిస్తామని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన సమావేశంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
KCR : తెలంగాణ సమాజం కష్టాల్లో ఉంది..
ఈ సందర్భంగా కేసీఆర్ (K.Chandra shekhar Rao) ప్రసంగిస్తూ… తెలంగాణ సాధన కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలు చేసి స్వరాష్ట్రాన్ని ...




