Warangal Outer Ring Road వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ కొత్తగా రైల్వే లైన్..!
                    Warangal Outer Ring Road | తెలంగాణలోని రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రైల్వే లైన్ నిర్మించడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఓరుగల్లు నగరం చుట్టూ రైల్వే లైన్ వేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధిలో తమతో కలిసి రావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన చెప్పారు.దివిటిపల్లి (Divitipalli)లో అమర రాజా (Amara Raja) గిగా ఫ్యాక్టరీ నిర్మాణపనులను ప్రారంభించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్‌కు శనివారం చేరుకున్నారు. ఈమేరకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ...                
                
             
								


