Urea Shortage : తెలంగాణలో తీవ్రమైన యూరియా కొరత, ఆందోళనలో అన్నదాతలు
                    Telangana news : యూరియా సరఫరా తగినంతగా ఉందని రాష్ట్ర అధికారులు పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ వరంగల్ (Warangal), కరీంనగర్ (Karimnagar) జిల్లాల్లోని యూరియా కొరత (Urea Shortage)తో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి అదనపు ఎరువుల నిల్వలను తీసుకుంటున్నట్లు అధికారులు ఒకవైపు చెబుతున్నప్పటికీ, రైతులు మండుతున్న ఎండల్లో గంటలపాటు వేచిచూడాల్సి దుస్థితి ఎదురవుతోంది. క్యూలైన్లలో నిలుచున్నా కూడా చాలా మందికి యూరియా అందలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితుల స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) వెలుపల క్యూలో నిలబడుతున్నారు. కొందరు ఎండలను తాళలేక తమ చెప్పులు, సంచులను లైన్‌లో ఉంచి, తమకు కేటాయించిన యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు రైతులకు తమ వాటా లభించినప్పటికీ, చాలా మంది రైతులు ఉత్త చ...                
                
             
								



