KCR | అసెంబ్లీకి చేరుకున్న గులాబీ దళపతి
KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ (Telangana Assembly )కి చేరుకున్నారు. కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని నందినగర్ నుంచి బయల్దేరి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగంతో శాసన సభ సమావేశాలు (Assembly Session 2025) ప్రారంభం కానున్నాయి. కాగా అసెంబ్లీ వద్ద కేసీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అసెంబ్లీ ప్రాంగణం లోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు.
బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి చేరుకున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. pic.twitter.com/8ohVJ5aa1g— BRS Party (@BRSparty) March 12, 2025
అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో రెడీ అయింది. ఈమేరకు నిన్ననే మాజీ సీ...

