Warangal : ఆడపిల్లలకు మత్తు మందు ఇచ్చి మృగాళ్లకు అప్పగిస్తూ..
Warangal News | డ్రగ్స్ కు బానిసైన ఓ కిలాడీ లేడి స్కూళ్లకు వెళ్లే అమాయక ఆడపిల్లలను టార్గెట్ చేసింది. మత్తు మందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన కొందరు దుండగులు కొన్ని రోజులుగా ఎన్నో అకృత్యాలు పాల్పడ్డారు. చివరకు వీరి ఘోరాలు చూసి ఏకంగా పోలీసులే షాక్ అయ్యారు. వారు చేసిన దారుణాలు తెలుసుకుంటే ఆడపిల్లలను పాఠశాలలకు పంపాలంటేనే అందరిలో వణుకు పుడుతోంది. వివరాల్లోకి వెళితే..
హనుమకొండ (Hanmakonda) జిల్లా దామెర (Damera) మండలానికి చెందిన ఓ కిలాడీ లేడీ కొన్నాళ్లుగా వరంగల్ మిల్స్ కాలనీలో నివాసముంటోంది. సదరు మహిళ తనతోపాటు డ్రగ్స్ (Drugs)కు అలవాటు పడిన ఓ యువతితో పాటు మరో నలుగురు యువకులతో కలిసి ముఠా ఏర్పడ్డారు. వీరంతా పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులను టార్గెట్ చేసుకుని దారుణాలకు పాల్పడ్డారు. వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద తరచూ రెక్కీ నిర్వహించేవారు. ఈ కిలేడీ స్...




