BSNL New Recharge Plan | 6 నెలల వాలిడిటీతో తక్కువ ధరతో కొత్త రీచార్జ్ ప్లాన్ ను విడుదల
BSNL New Recharge Plan : ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లతో విసిగిపోయి, తక్కువ ధరకే ఎక్కువ రోజులు చెల్లుబాటు గల రీచార్జ్ ప్లాన్ కోసం మీరు ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే BSNL మీకు శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ 6 నెలల చెల్లుబాటు (6-month validity plan) తో వచ్చే బడ్జెట్- ఫ్రెండ్లీ రూ. 750 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది, ఇది మార్కెట్లో అత్యంత సరసమైన దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లలో ఒకటిగా నిలిచింది.
BSNL యొక్క రూ. 750 ప్లాన్: తక్కువ ధరకే దీర్ఘకాల చెల్లుబాటుBSNL తన GP2 వినియోగదారుల కోసం ఈ ప్లాన్‌ను ప్రారంభించింది, అంటే వారి మునుపటి ప్లాన్ గడువు ముగిసిన 7 రోజుల్లోపు వారి మొబైల్ నంబర్‌లను రీఛార్జ్ చేయని వారి కోసం ఇది వర్తిస్తుంది. .
BSNL New Recharge Plan | రూ. 750 ప్లాన్ ప్రత్యేకతలు
180 రోజుల పాటు అన్ని లోకల్, STD నెట్‌వర్క్‌లకు అపరిమిత ఉచిత కాలింగ్.
రోజుకు 100 ఉచిత SMSలు, వ...
