Rajiv Yuva Vikasam scheme | రాజీవ్ యువ వికాసం స్కీం కింద రూ. 3 లక్షల రుణం, 80 శాతం సబ్సిడీ
ఆన్ లైన్ లో ఇలా దరఖాస్తు చేసుకోండి..
Rajiv Yuva Vikasam scheme : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాజీవ్ యువ వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించారు. సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నాతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం రూ. 6000 కోట్ల వరకు రాయితీతో రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ. 4 లక్షల వరకూ సబ్సిడీ రుణం కేటాయించే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచే ప్రారంభం కాగా, ఏప్రిల్ 5వ తేదీ వరకూ స్వీకరించనున్నారు. దరఖాస్త...




