ArcelorMittal | ఉక్కు ఫ్యాక్టరీకి మార్గం సుగుమం.. తొలగిన అడ్డంకులు
ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర ఉక్కు కర్మాగారం (integrated sintegrated steel plant) స్థాపించేందుకు ఆర్సెలర్‌మిట్టల్ (ArcelorMittal) సంస్థ తొలి అడుగు వేసింది. రూ. లక్ష కోట్లతో ఈ ఫ్యాక్టరీని స్థాపించనుంది. దీని కోసం ఓ పోర్టును కూడా ఆ సంస్థ నిర్మించనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh government) ఆర్సెలర్‌మిట్టల్ సంస్థ విశాఖపట్నంలోని నక్కపల్లి సమీపంలో మూడు కిలోమీటర్ల సముద్రతీరాన్ని, 2,200 ఎకరాల భూభాగాన్ని కేటాయించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ArcelorMittal : మంత్రి నారా లోకేష్ జోక్యం
ఈ పోర్ట్ నిర్మాణం కోసం ముందుగా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కేజీపీఎల్ ట్విన్-పోర్ట్ సెజ్ కాంప్లెక్స్ ప్రస్తుతం అరబిందో గ్రూప్ (Aurobindo Group) ఆధీనంలో ఉంది. 25 ...

